ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా… బీరువాలో ఈ వస్తువులు ఉంచితే చాలు సమస్యలు మాయం!

the-top-5-financial-issues-millennials-face-today

ప్రస్తుత కాలంలో ఏ పని చేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉంది అందుకే డబ్బు కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం పొందాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి. సిరిసంపదలకు ప్రతీక అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనానికి లోటు ఉండదు.

ఈ విధంగా మనం సంపాదించిన డబ్బులు చేతిలో నిలబడి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి ఎప్పటికీ మనతోనే ఉంటుంది ఇలా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే మన ఇంట్లో డబ్బు దాచుకునే చోట బీరువాలో ఈ వస్తువులు కనుక ఉంటే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది మరి బీరువాలో ఉంచాల్సిన ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే…

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రజలు అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులతో పూజ చేసి ఆ పువ్వుని బీరువాలో డబ్బు నగలు ఉంచి ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.అయితే ప్రతి శుక్రవారం తాజా తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత బీరువాలో ఉంచాలి. పౌర్ణమి రోజున పసుపు ముద్ద తయారుచేసి దానిని లక్ష్మీదేవిగా భావించి పూజలు చేయాలి. పండుగ పూర్తయిన తర్వాత ఆ పసుపు ముద్దని బీరువాలో డబ్బులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది.

అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రంలో 12 నాణేలను ఉంచి పూజ చేసి ఆ తర్వాత వాటిని ముడివేసి బీరువాలో డబ్బులు పెట్టెలో ఉంచడం వల్ల కూడా ఇంట్లో ధనానికి లోటు ఉండదు. ఇలా బీరువాలో ఎర్రటి వస్త్రం, పసుపు ముద్ద,తామర పువ్వు ఉంచటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుందనీపండితులు చెబుతున్నారు ఇలా బీరువాలో ఈ వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండి డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఉంటుందని చెప్పాలి.