ఐటీఐ పాసైన వాళ్లకు అదిరిపోయే శుభవార్త.. ఏపీఎస్ఆర్టీసీలో 309 పోస్టులు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఆన్ లైన్ లో అప్రెంటీస్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఐ పాసైన అభ్యర్థులు అప్రెంటీస్ శిక్షణకు అర్హులు కాగా దరఖాస్తును నింపి అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.

శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధితో పాట్ కర్నూలు, నంద్యాల, అనంతపురం పరిధిలో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కర్నూలులోని ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజ్ లో సర్టిఫికెట్లను పరిశీలించి ఆసక్తి ఉన్నవాళ్లను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ ట్రేడ్ లకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ ట్రేడ్ లతో పాటు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడ్ ల భర్తీ కూడా జరగనుందని సమాచారం అందుతోంది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ ను నింపి సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంటుంది. కడప, కర్నూల్, అనంతపూర్, నంద్యాల, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో చదివిన వాళ్లు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలను సమీపంలోని ఆర్టీసీ కార్యాలయంను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్ శిక్షణ పొందాలని భావించే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎగ్జామ్ లేకుండానే ఎంపిక జరుగుతుండటంతో నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.