ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు.. మంచి వేతనంతో?

ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 6 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి నెల 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://apmdc.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సర్వే) (మెటాలిఫరస్) ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా మేనేజ్‌మెంట్ ట్రైనీ (సర్వే) (కోల్‌) ఉద్యోగ ఖాళీలు సైతం 3 ఉన్నాయి. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఎంపికైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా లక్షా 24 వేల రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది.

జనరల్ అభ్యర్థులకు మాత్రం ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.