ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బ్యాంక్ ఉద్యోగ ఖాళీల కోసం ప్రయోజనం చేకూరే విధంగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. మొత్తం 35 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 35 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీని కలిగి ఉండటంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు రూ.17,900 నుంచి రూ.47,920 వరకు వేతనం లభించనుంది.
ఆన్ లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో జనరల్, బీసీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజు 700 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్‌ఎం అభ్యర్థులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుందని సమాచారం అందుతోంది.
ఈ నెల 7వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 21వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది. 2023 సంవత్సరం నవంబర్ నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.