ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రాతపరీక్ష లేకుండా వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే. ఏపీ పాఠశాల విద్య పరీక్షల సంచాలకుల కార్యాలయం జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.
మొత్తం 12 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు రూ.18,500/ నుండి 35,000/ వేతనం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉన్న ఊర్లోనే జాబ్ చేయాలని భావించే వాళ్లకు ఈ జాబ్ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు జీతం 20,500 రూపాయలు అని సమాచారం.
క్లినికల్ సైకాలజిస్టు, ఆక్యూషనల్ థెరపిస్ట్, సీనియర్ ఫిజియో థెరఫిస్టు ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాస్టిటిస్ట్, సీనియర్ ఫ్రాస్టిటిస్ట్, సీనియర్ స్పీచ్ థెరపిస్ట్, హియరింగ్ అసిస్టెంట్, మెబిలిటి ఇన్స్ట్రక్టర్, ట్రాన్స్-డిసిప్లీనరీ స్పెషల్ ఎడ్యుకేటర్, ఎర్లీ ఇంటర్వెంక్షన్ థెరఫిస్టు, అటెండెంట్ కమ్ ప్యూవున్ కమ్ మెసెంజర్, ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుండగా అర్హత, అసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు జరగనుంది.
