అదిరిపోయే శుభవార్త చెప్పిన అమెజాన్.. ఇంట్లోనుంచి రూ.2 వేల నోట్లు మార్చుకునేలా?

Amazon-1

రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా రూ.2 వేల నోట్లను రద్దు చేసిన తర్వాత ఈ నోట్లను మార్చుకోవడం చాలామందికి సమస్యగా మారింది. బ్యాంకుకు వెళ్లి క్యూ లైన్లలో నిలబడి 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడం చాలామంది తలనొప్పిగా భావిస్తున్నారు. అయితే అమెజాన్ ఇంటినుంచి రూ.2 వేల నోట్లను సులువుగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. నెలకు 50,000 రూపాయల వరకు అమెజాన్ ద్వారా 2,000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు.

 

అమెజాన్ పే క్యాష్ లోడ్ ఆప్షన్ ద్వారా కస్టమర్లు క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. అమెజాన్ డెలివరీ బాయ్స్ కు మీ దగ్గర ఉన్న 2,000 రూపాయల నోట్లను ఇచ్చి ఆ నోట్లకు సమానమైన మొత్తాన్ని అమెజాన్ పేలో డిపాజిట్ అయ్యేలా చేసుకోవచ్చు. ఏదైనా ప్రాడక్ట్ ను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి డెలివరీ బాయ్ వచ్చిన సమయంలో సులువుగా 2,000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.

 

సెప్టెంబర్ 30వ తేదీ వరకు సులువుగా ఈ విధంగా 2,000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అమెజాన్ లో తరచూ షాపింగ్ చేసేవాళ్లు ఈ ఆప్షన్ ను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. అమెజాన్ కస్టమర్లకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. 50,000 కంటే తక్కువ మొత్తం 2,000 రూపాయల నోట్లు ఉన్నవాళ్లు ఈ ఆప్షన్ ను సద్వినియోగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

 

అయితే అమెజాన్ పేలో లోడ్ అయిన అమౌంట్ ను మళ్లీ క్యాష్ రూపంలో మార్చుకోవడం మాత్రం కుదరదు. ఈ విషయాలను గుర్తుంచుకుని క్యాష్ లోడ్ చేయించుకుంటే మంచిది. రూ.2 వేల నోట్ల రద్దును అమెజాన్ తెలివిగా ఉపయోగించుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.