పీరియడ్స్ సమయంలో విద్యార్థులు, యువతులు, మహిళలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మహిళలు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా తమను తాము రక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది. నెలసరి సమయంలో శుభ్రతకు కచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. శుభ్రత పాటించని పక్షంలో ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని చెప్పవచ్చు.
4 నుంచి 6 గంటల్లోపు తప్పనిసరిగా ప్యాడ్ మార్చుకుంటే మంచిది. అలా మార్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతుంది. అపరిశుభ్రమైన చేతుల వల్ల కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం నెలసరి కోసం మెన్ స్ట్రువల్ కప్స్, పీరియడ్ ప్యాంటీస్, ట్యాంపన్స్ మరికొన్ని అందుబాటులో ఉన్నాయి. రక్తస్రావాన్ని బట్టి వీటీలో సౌకర్యంగా అనిపించేది ఎంచుకుంటే మంచిది. పీరియడ్స్ సమయంలో రెండు పూటలా వేడినీటితో స్నానం చేయాలి ఇలా చేయడం ద్వారా ఒళ్లు నొప్పులు సైతం తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
సౌకర్యంగా ఉండే దుస్తులను ధరించడం ద్వారా బయటకు వెళ్లిన సమయంలో ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లను తాగాలి. పండ్లు, తాజా కూరగాయలు తీసుకుంటే హెల్త్ కు మంచిది.