పట్టుచీరలు కొత్తగా మెరవాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఈ విషయాలు తెలుసా?

ఆడవాళ్లు పట్టుచీరలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. పట్టుచీరలు కొత్తగా మెరవాలని వాళ్లు భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పట్టుచీరలు ఎంత కాలమైనా మెరుస్తూ ఉంటాయి. పట్టుచీరలు ఇతర చీరలతో పోలిస్తే ఒకింత సున్నితంగా ఉంటాయి. పట్టుచీరల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే అవి మెరుపు కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు.

పట్టుచీరలను ధరించిన తర్వాత వాటిని గాలి తగిలేలా ఆరివేయాలి. పొడిగా ఉన్న చీరలను ఇస్త్రీ చేసి మడతబెట్టి వాటిని బీరువాలు లేదా అల్మారాలలో ఉంచాలి. పట్టుచీరలపై మరకలు ఉంటే దూదిని నీళ్లతో ముంచి శుభ్రం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. పట్టుచీరలను డ్రై క్లీనింగ్ చేయడం ద్వారా అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండే ఛాన్స్ ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.

పట్టుచీరలను గట్టిగా పిండటం వల్ల వాటి మన్నిక తగ్గే అవకాశంతో పాటు నీళ్లలో ఎక్కువగా చీరను నానబెడితే క్వాలిటీ తగ్గుతుందని చెప్పవచ్చు. పట్టుచీరలు ఏదైనా కారణం వల్ల రంగును కోల్పోతూ ఉంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రంగు వదిలే పట్టుచీరలను నిమ్మరసం వేసి పిండటం ద్వారా ఆ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది.

ఈ చిట్కాలు పాటించడం ద్వారా పట్టు చీరలకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్త పడటంతో పాటు ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. పట్టుచీరలను ఎక్కువగా ధరించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.