శీతాకాలంలో మెరిసే చర్మం పొందాలని అనుకుంటున్నారా… అదిరిపోయే చిట్కాలివే!

చలికాలంలో అందమైన చర్మం కావాలని చాలామంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో యువత ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అందంగా కనిపించడం కోసం చాలామంది అమ్మాయిలు బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతున్నారు. చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా అందంగా కనిపించే అవకాశం ఉంటుంది.

చలికాలంలో చర్మం హైడ్రేటెడ్ గా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. బయటికి వెళ్లే సమయంలో సన్‌స్ర్కీన్ లోషన్‌ను వాడటం ద్వారా అందంగా కనిపించడం సాధ్యమవుతుంది. ఓట్స్ పౌడర్, 3 చెంచాల పాలు, ఒక చెంచా గ్లిజరిన్ ను ముఖానికి అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రెండు చెంచాల పెరుగు, బీట్‌రూట్ రసం కలిపి 10 నిముషాల పాట ముఖంపై మసాజ్ చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతున్నాయి.

ఈ విధంగా చేయడం ద్వారా చర్మం మృదువుగా మారడంతో పాటూ కాంతివంతంగా ఉంటుందని చెప్పవచ్చు. ముల్తానీ మట్టి, శనగ పిండి, బంగాళా దుంప రసం తీసుకుని అర చెంచా గ్లిజరిన్, కొన్ని పాలు వేసి కలిపి ముఖానికి పట్టించి శుభ్రం చేసుకోవాలి. చియా గింజలు, బీట్‌రూట్ రసం, పాలను కలిపి కూడా ఫేస్ ప్యాక్ చేయడం వల్ల ముఖం మిలమిలా మెరుస్తుందని చెప్పవచ్చు.

ఈ విధంగా చేయడం ద్వారా ముఖంపై నల్ల మచ్చలు కూడా తొలగిపోయి మెరుస్తూ ఉంటుందని చెప్పవచ్చు. పొడి చర్మం ఉన్న వారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. ఆర్టిఫిషియల్ క్రీమ్స్ కంటే సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందే ఛాన్స్ ఉంటుంది.