మనలో చాలామంది కాలేయం ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాలేయంకు సంబంధించి చిన్నచిన్న తప్పులు చేస్తే ఆరోగ్యానికే ప్రమాదం వాటిల్లే అవకాశాలు అయితే ఉంటాయి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలేయం సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు. పీచు పదార్థాలను తీసుకోవడం ద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు.
పీచు పదార్థాల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జొన్నలు, సజ్జలు, రాగులతో చేసిన ఆహారం కాలేయ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇప్పటికే కాలేయ సమస్యలతో బాధ పడేవాళ్లు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మెంతులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.
కాలేయానికి కొవ్వు పట్టకుండా చేయడంలో బ్రకోలీ తోడ్పడుతుందని చెప్పవచ్చు. బ్రకోలీని నూనెలో వేయించి తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ప్రతిరోజూ నట్స్ తీసుకోవడం ద్వారా కాలేయానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ బాదం పప్పులు తీసుకోవడం ద్వారా కూడా కాలేయంకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.
తోటకూర, మెంతికూర, పాలకూర తీసుకోవడం ద్వారా కాలేయం హెల్తీగా ఉంటుందని చెప్పవచ్చు. కాలేయం సాఫీగా పని చేయడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు. ఎక్కువగా మద్యం తాగేవాళ్లను కాలేయానికి సంబంధించిన సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుంది.