మనలో చాలామంది నల్లుల గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. ఇంట్లో అపరిశుభ్రంగా ఉంటే నల్లులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నల్లుల వల్ల ప్రశాంతమైన నిద్రకు ఆటంకం కలగడంతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పొరపాటున నల్లులు చెవిలో దూరితే మరింత ప్రమాదం అని చెప్పవచ్చు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
రక్తమే నల్లుల ఆహారం కాగా నల్లుల వల్ల మన శరీరంపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే నల్లులకు చెక్ పెట్టడానికి కొంతమంది పెస్టిసైడ్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పెస్టిసైడ్స్ వాడకం వల్ల తాత్కాలికంగా ఆ సమస్యకు చెక్ పెట్టినా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
తేమ అధికంగా ఉండి గాలి ప్రసరణ లేని ఇళ్లలొ నివశించే వాళ్లను ఎక్కువగా ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పరుపు, మంచాన్ని ఎండలో ఉంచడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. నల్లులు ఉన్న ప్రాంతంలో వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. దుప్పట్లు, బెడ్‌కవర్స్, పిల్లో కవర్స్‌ను తరచూ శుభ్రం చేయడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
లావెండర్ ఆయిల్ వల్ల నల్లులు నశించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. లావెండర్ ఆయిల్ లో ముంచిన వస్త్రంతో కుర్చీలు, మంచాన్ని తుడిస్తే నల్లులు నశించే అవకాశం అయితే ఉంటుంది. పుదీనా ఆకులను నల్లుల బెడద ఎక్కువగా ఉన్న చోట ఉంచితే నల్లుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. మిరియాలు, యూకలిప్టస్ ఆయిల్ కూడా నల్లులను చంపడానికి ఎఫెక్టివ్‌గా పని చేయడంలో ఉపయోగపడుతుంది.