మనలో చాలామంది హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చపాతీ, నూడిల్స్, బిరియానీ, ఫ్రైడ్ రైస్, కర్రీలు ఈ విధంగా ఏం కొనుగోలు చేసినా ప్రస్తుతం అల్యూమినియం ఫాయిల్ లేదా కవర్లలో ప్యాక్ చేసి ఇస్తున్నారు. అల్యూమినియం ఫాయిల్ లో ఉన్న ఆహారం ఎక్కువ సమయం పాటు వేడిగా ఉంటుంది. మహిళలు పిల్లలకు, మగవారికి లంచ్ ప్యాక్ చేయడం కోసం అల్యూమినియం ఫాయిల్స్ ను వాడతారు.
అయితే అల్యూమినియం ఫాయిల్ అంత సేఫ్ కాదని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం మీద అల్యూమినియం చాలా చెడ్డ ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది. అల్యూమినియం శరీరంలోకి ఎక్కువగా వెళ్లడం వల్ల గందరగోళం, కండరాల బలహీనత, ఎముకల నొప్పి, మూర్చలు, మాట్లాడటంలో తడబాటు, పిల్లలలో ఎదుగుదల తగ్గడం మొదలైన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
అల్యూమినియం పాత్రలో వండటం కంటే కూడా అల్యూమినియం ఫాయిల్, కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. అల్జీమర్స్, పార్కన్సన్స్, మల్టిపుల్ స్ల్కెరోసిస్ వంటి నాడీ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచడంలో అల్యూమినియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించాలి. ఆహారాన్ని వండటానికి మట్టి, గాజు, సిరామిక్, స్టీల్ పాత్రలలో ఆహారాన్ని వండుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
అల్యూమినియం ఫాయిల్ లో ఆహారాన్ని ప్యాక్ చేసినా దాన్ని ఎక్కువసేపు ఉంచకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. అల్యూమినియం ఫాయిల్ లో ఉంచి ఓవెన్ లో పెట్టి వేడిచేయడం చాలా డేంజర్ అని వైద్యులు చెబుతున్నారు.