బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. జూనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. aiimsbilaspur.edu.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
మొత్తం 141 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా 140 జూనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలు, 1 జూనియర్ రెసిడెంట్ (డెంటిస్ట్రీ) ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. నవంబర్ 7, 2023న ఉదయం 11 గంటల నుంచి ఈ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి డెంటల్ డిగ్రీ లేదా బీడీఎస్ పాసై ఉంటే మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 3వ అంతస్తు, ఎయిమ్స్ – బిలాస్‌పూర్, కోతిపురా, హిమాచల్ ప్రదేశ్-174037 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిజికల్ గా ఈ ఉద్యోగ ఖాళీలకు హాజరు కావాల్సి ఉండనుందని తెలుస్తోంది.
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 590 రూపాయలు కాగా ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1180 రూపాయలుగా ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నెఫ్ట్ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎయిమ్స్ బిలాస్ పూర్ వెబ్ సైట్ ను అధికారికంగా తనిఖీ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.