మహిళలకు భారీ షాక్ ఇచ్చిన మోదీ సర్కార్.. ఆ స్కీమ్ లో చేరితే మాత్రం చుక్కలే!

కేంద్ర ప్రభుత్వ పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీ స్థాయిలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు సంబంధించి పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్నిరోజుల క్రిఅం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ పేరుతో ఒక కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి ఈ స్కీమ్ అమలవుతూ ఉండగా ఈ స్కీమ్ నియ్మ నిబంధనలు ఇతర స్కీమ్స్ కు భిన్నంగా ఉన్నాయి. మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. కేవలం రెండు సంవత్సరాల కాలానికి ఈ స్కీమ్ డబ్బులు డిపాజిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.

కనీసం 1000 రూపాయల ఉంచి గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో సులువుగా డబ్బులను డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం వడ్డీని ఈ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు, వచ్చే వడ్డీకి ఎలాంటి మినహాయింపులు ఉండవని సమాచారం అందుతోంది.

ఆదాయపు పన్ను రికార్డులలో ఈ స్కీమ్ ద్వారా పొందే వడ్డీని చూపించాల్సి ఉంటుంది. ట్యాక్స్‌పేయర్ శ్లాబ్‌ ఆధారంగా ఇన్వెస్ట్ చేసి మొత్తం, పొందే వడ్డీ విషయంలో మార్పులు ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం వడ్డీని పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.