ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు 1,40,000 వేతనంతో?

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తుండటం గమనార్హం. 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు ఈ ఏడాది గేట్ స్కోర్ ను కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 106 ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్) ఉద్యోగ ఖాళీలు 90, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) పోస్టులు 3 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) ఉద్యోగ ఖాళీలు 278 ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉద్యోగ ఖాళీలు 13 ఉండటం గమనార్హం.

మే నెల 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.aai.aero/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది.

2024 సంవత్సరం మే సమయానికి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.