ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్,సీనియర్ అసిస్టెంట్ జాబ్స్.. భారీ వేతనంతో?

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 119 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 27 నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. 2024 సంవత్సరం జనవరి 26 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

aai.aero అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఉద్యోగ ఖాళీలు 73 ఉండగా జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) ఉద్యోగ ఖాళీలు 2, సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) ఉద్యోగ ఖాళీలు 25, సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) ఉద్యోగ ఖాళీలు 19 ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సర్వీస్ మేన్ అభ్యర్థులు, అంగ వైకల్యం ఉన్నవాళ్లు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయించబడటం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని అన్ని డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసి దరఖాస్తు రుసుమును చెల్లించి భవిష్యత్తు అవసరాల కోసం హార్డ్ కాపీని సేవ్ చేసుకోవాలి.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి.