ఏఐఈఎస్ఎల్ లో భారీ వేతనంతో సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 209 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. aiesl.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

2024 సంవత్సరం జనవరి 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. బీఎస్సీ, బీకాం, బీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి కనీసం ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు లిమిట్ కాగా 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఢిల్లీలో 87 ఉద్యోగ ఖాళీలు ఉండగా ముంబైలో 70 పోస్టులు, కోల్‌కతాలో 12 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ లో 10 పోస్టులు ఉండగా నాగ్‌పూర్ లో 10, తిరువనంతపురంలో 20 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల మేలు జరుగుతుండగా ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 27 వేల రూపాయల వేతనం లభించనుంది.