నిరుద్యోగులకు తీపికబురు.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగ ఖాళీలు!

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఈ సంస్థ అనుబంధ సంస్థ నుంచి మొత్తం 900 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తి చేయడానికి జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం గమనార్హం. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

డిసెంబర్ నెల 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. aaiclas.aero వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 906 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కలిగి ఉంటారు. కనీసం 60 శాతం మార్కులు పొందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు, 55 శాతం మార్కులు పొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పర్సనల్ ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వాళ్లకు 30,000 రూపాయల వేతనం లభించనుంది.