అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్.. ఏపీ మహిళలకు అదిరిపోయే ఒక శుభవార్త ఇదే!

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులలో భాగంగా ఈ మధ్య కాలంలో వరుసగా అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం. ఏపీ మహిళలకు బెనిఫిట్ కలిగేలా జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుండగా అర్హత ఉన్న మహిళలకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలగనుంది. అంగన్ వాడీ వర్కర్, అంగన్ వాడీ హెల్పర్, మినీ అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఏపీలోని విశాఖలో 47 ఉద్యోగ ఖాళీలు ఉండగా అర్హత ఉన్న మహిళలు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జులై నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 3వ తేదీలోగా సీడీపీవో కార్యాలయంలో దరఖాస్తులను అందజేయవచ్చు.

అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు 11,500 రూపాయలు వేతనం ఉండగా ఆయాలకు 7000 రూపాయలు లభించనుంది. హెల్పర్ పోస్టులకు కూడా 7000 రూపాయల వేతనం ఉంటుందని తెలుస్తోంది. కడప, విజయనగరం జిల్లాలలో కూడా వేర్వేరుగా 70కు పైగా ఖాళీలు ఉన్నాయి. సంబంధిత వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల ద్వారా ఎంతో బెనిఫిట్ పొందవచ్చు. విద్యార్హత కలిగి ఉండటంతో పాటు పిల్లలతో ప్రేమ పూర్వకంగా మెలిగే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.