మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలకు, ఆచారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వకాలం నుండి ప్రజలు వీటిని అనుసరిస్తూ వస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కొంతమంది ఆచారాలను, సాంప్రదాయాలను గాలికి వదిలేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీ జీవితంలో అపురూపమైన ఘట్టం మాతృత్వం. వివాహం అయిన ప్రతి స్త్రీ మాతృత్వాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. గర్భంతో ఉన్న తొమ్మిది నెలలు భార్య కోరిక మేరకు ఆమె కోరికలను తీర్చే బాధ్యత భర్తకి ఉంటుంది. ఇలా గర్భంతో ఉన్న భార్యని సంతోషంగా ఉంచటం వల్ల కడుపులో బిడ్డ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి.
భార్య గర్భంతో ఉన్న సమయంలో భర్త పొరపాటున కూడా సముద్ర స్నానం చేయరాదు. అంతే కాకుండా పచ్చటి చెట్లు కూడా నరకకూడదు. ఇలా ప్రాణం ప్రాణంతో ఉన్న పచ్చని చెట్లు నరకడం వల్ల పుట్టబోయే బిడ్డకు అరిష్టం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే భార్య గర్భంతో ఉన్న సమయంలో ఆమెకు ఆరు నెలలు నిండిన తర్వాత భర్త దాదాపు మూడు నెలల పాటు బిడ్డ పుట్టే వరకు కటింగ్ చేయించుకోవటం, షేవింగ్ చేసుకోవడం అంటే పనులు చేయరాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎవరైనా తెలిసిన వారు ,లేక బందువులు మరణిస్తే అక్కడికి వెళ్లి మరణించిన వారి పాడే కూడా మోయరాదు.
అసలు భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త అలా శవం ఉన్న ఇంటికి వెళ్లడం కూడా అరిష్టంగా భావిస్తారు. అలాగే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎల్లప్పుడూ ఆమె వెంట తోడుగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వచ్చినా కూడా ఆ పనులను రద్దు చేసుకొని బిడ్డ పుట్టే వరకు భార్యకి తోడుగా ఉండాలి. ఎందుకంటే గర్భంతో ఉన్న సమయంలో స్త్రీ భర్తతోడును కోరుకుంటుంది. అలాగే తీర్థయాత్రలు, పర్వతారోహణ, సముద్ర ప్రయాణం కూడా చేయకూడదు. అలాగే భార్య గర్భంతో ఉన్న సమయంలో గృహప్రవేశం తో పాటు అభిషేకం వంటి ఇతర పూజలలో కూడా పాల్గొని పూజ చేయరాదు. చేయకూడదట. ఇలా భార్య గర్భంతో ఉన్న సమయంలో భర్త ఈ నియమాలు పాటించడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.