కడప జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం తాజాగా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 22 ఉద్యోగ ఖాళీలు ఉండగా కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
జీఎన్ఎం/బీఎస్సీ (నర్సింగ్) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.27,675 వేతనం చెల్లించనున్నారని సమాచారం అందుతోంది. అకాడమిక్ మార్కులు, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కడపలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తుండటంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ ఇదే విధంగా మిగతా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.