ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 577 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. యూపీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి 418 పోస్టులు ఉండగా అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కు సంబంధించి 159 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చదివిన వాళ్లు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న ఉద్యోగులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతోంది.
ఇతర ఉద్యోగాలతో పోల్చి చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ సైతం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ.పీ.ఎఫ్.వో వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.