దేశంలో సంతాన లేమి సమస్యలతో బాధ పడే మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొంతమంది ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతోంది. అయితే గర్భం రాకపోవడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. కొంతమంది వేర్వేరు కారణాల వల్ల గర్భ నిరోధక మాత్రలను వాడుతూ ఉంటారు. అయితే ఈ మాత్రలను వాడటం వల్ల గర్భం ఎప్పటికీ రాకపోవచ్చు.
కొంతమంది మహిళలు బరువు ఎక్కువగా ఉంటారు. ఎత్తుకు మించి బరువు ఉండటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో గర్భం దాల్చలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైతే ఊబకాయం సమస్యతో బాధ పడుతూ ఉంటారో ఆ మహిళ పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఈ కొవ్వు వల్ల ఫిమేల్ హార్మోన్లు మేల్ హార్మోన్లుగా మార్పు చెందే అవకాశం అయితే ఉంటుంది. అధిక బరువు ఉన్న మహిళలు బరువును అదుపులో ఉంచుకుంటే మంచిది.
పాలీసిస్టిక్ ఓవరీస్ సమస్య కూడా కొంతమందిలో అధిక బరువుకు కారణమవుతుందని చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధ పడేవాళ్లను ముఖం, గడ్డం, అవాంఛిత రోమాలు ఇతర సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ ఆరోగ్య సమస్యలు గర్భసంచి సమస్యలకు కారణమవుతాయి. ఈ సమస్యతో బాధపడేవాళ్లకు గర్భానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
గర్భసంచి లోపల పెరగాల్సిన ఎండోమెట్రియాసిస్ అనే పొర గర్భసంచి బయట పెరగడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుంటే సులువుగా గర్భం దాల్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్యల విషయంలో మహిళలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు.