మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ రేంజ్ లో పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే కెరీర్ పరంగా సెటిల్ అయినట్టేనని చాలామంది ఫీలవుతారు. అయితే ఇలా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూసే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. 473 అప్రెంటీస్ ఖాళీల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.
iocl.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫిబ్రవరి నెల 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. 18 నుంచి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను ఐవోసీఎల్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తం వేతనం లభించనుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ కూడా ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఐఓసీఎల్ ఎప్పటికప్పుడు కొత్త జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ నిరుద్యోగులకు మేలు చేస్తోంది.