ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఈ సంస్థ నుంచి తాజాగా రెండు జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే. బీఈడీ అర్హత లేకుండానే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది.
10,391 మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. మొదట 4062 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా తాజాగా మరో 6,000 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.
మొదట విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, పీజీటీ, అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా తాజాగా విడుదలైన జాబ్ నోటిఫికేషన్ ద్వారా టీజీటీ, లైబ్రేరియన్, హాస్టల్ వార్డెన్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. https://emrs.tribal.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వాళ్లు అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
టీజీటీ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలు కాగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.