జపాన్ లో సూపర్ టూనా… ఈ చేప ఖ‌రీదు తెలిస్తే షాకే?

ప్రపంచంలోనే ఖరీదైన చేప ‘టూనా’. మన దగ్గర దాన్ని ‘తూర’ అని పిలుస్తారు. టూనాలను చూస్తే జపనీయులు లొట్టలేస్తారు. అచ్చం వంజరం చేప‌లాగా దాని వుంటుంది. కొందరికి అదేమిటో కూడా తెలియదు కాబట్టి సింపుల్‌గా అద్భుతమైన చేప అని చెప్పాల్సి ఉంటుంది. దాని మాంసం మహాద్భుతం. అయితే విదేశాల్లోనే ఈ చేపకు డిమాండ్ ఎక్కువ. మన టూనాలు జపాన్, అమెరికాలకే ఎగుమతి అవుతాయి. దీనివల్ల భారతదేశానికి ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. ఇంత విలువైన టూనా ఎక్కడంటే అక్కడ దొరకదు. విశాఖపట్నం సముద్రతీరంలోనే ఎక్కువగా దొరుకుతోంది. ఈ క్రమంలో ఓ అరుదైన బ్లూఫిన్ టూనా చేప లభ్యం కాగా దాన్ని వేలం వేస్తే రూ.13 కోట్లకు అమ్ముడైంది.

జపాన్ లోని సుషీ చెయిన్ రెస్టారెంట్ల ఓనర్ కియోషి కిమురా ఈ 267 కిలోల భారీ చేపను వేలంలో దక్కించుకున్నాడు. గతేడాది ఇంతకంటే బరువైన చేపను కూడా కిమురానే కొనేశాడు. అప్పుడు దాని ధర రికార్డు స్థాయిలో రూ.22 కోట్లు పలికింది. కిమురాకు జపాన్ వ్యాప్తంగా చెయిన్ రెస్టారెంట్లు ఉన్నాయి. తన రెస్టారెంట్లలో టూనా చేపల వంటకాలకు మాంచి డిమాండ్ ఉందని, కస్టమర్ల తృప్తే తమ ధ్యేయమని కిమురా తెలిపారు.

ఒక్కొక్కసారి అండమాన్, కేరళ, తమిళనాడులోని కొన్నిచోట్ల మత్స్యకారుల వలలకు చిక్కుతుంది. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే అంటే- నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది సముద్రంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆ సమయంలోనే జాలర్లు వాటిని వేటాడి పట్టుకుని సొమ్ము చేసుకుంటారు. టూనా నీటిలో ఈదే తీరు, వాటి సంచారం, వేటాడే పద్ధతి, మార్కెట్‌కు చేరవేసే ప్రక్రియ, విక్రయించే పద్ధతి అన్నీ ఆసక్తి కలిగిస్తాయి. ఇది కొత్త జీవరాశి ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇదివరకు ఈ చేపను ప్రత్యేకంగా ఎవరూ వేటాడలేదు. అందుకే వెలుగులోకి రాలేదు.