పిల్లల మనసుని తెలుసుని మలుచుకోవాలి. చిన్న పిల్లల ఆత్మాభిమానం ఇతరులు కలుగ చేసే అవమానాన్ని భరించలేదు. తాము తప్పుచేస్తున్నప్పుడు ఇతరులు చూస్తే అతిగా చలిస్తారు. తమ ఆత్మాభిమానానికి మచ్చపడితే సహించలేరు. ముఖ్యంగా స్నేహితుల హేళనలను, ఉపాధ్యాయుల పరుష విమర్శలను చిరకాలం గుర్తు పెట్టుకొంటారు. ఒక పిల్లాడిని స్కూల్లో ఉపాధ్యాయుడు ఇన్‌స్పెక్టర్ వచ్చినప్పుడు సరిగ్గా పాఠం అప్పజెప్ప లేదని అందరి పిల్లల ముందు కొట్టింది. అప్పటి నుండి జీవితాంతం వరకు ఆ పిల్లవాడు అపరిచయస్తుల ముందు నోరు విప్పి మాట్లాడలేక పోయాడు. ఇలాంటి అవమానాలు మాయని మచ్చలుగా చిన్న పిల్లల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. పెద్దలకు చిన్న తప్పుగా కన్పించే అల్ప విషయాలు చిన్నపిల్లలకు విభ్రాంతిని కలిగించవచ్చు. అందువల్ల పెద్దలు ప్రతి అంశాన్ని చిన్న పిల్లల దృష్టితో పరిశీలించి పిల్లలతో వ్యవహరించాలి. ఒకే పిల్లవాడు వివిధ సడ్జెక్ట్‌లు పట్ల విని ఆ వైఖరిని ప్రదర్శిస్తాడు. అతనికి నచ్చిన సడ్జెక్ట్ పై ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తాడు. బాగా చదువు తాడు. ఇష్టం లేని సబ్జెక్ట్ పై అశ్రద్ధ చేస్తాడు. అతని అశ్రద్ధకు కారణాన్ని తెలుసుకుని ఆ సబ్జెక్ట్ అర్ధం అయ్యేలా చెపితే పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు. ఎందుకంటే వారికి కూడా అందరిలాగా అన్ని సబ్జక్టుల్లో ముందుండాలనిపిస్తుంది.
కానీ ప్రస్తుతం రోజుల్లో ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అంత ఓపిక వుండడం లేదు. అందువల్ల అతని ప్రావీణ్యతను గుర్తించకుండా, అతని లోపాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకొని అవమాని స్తారు. అట్టి పరిస్థితులలో అతనికి ఎంతో నచ్చిన సబ్జెక్ట్‌ని కూడా అశ్రద్ధ చేస్తాడు. అందువల్ల చిన్న పిల్లల ఆత్మాభిమానం దెబ్బ తినకుండా జాగ్రత్తపడ వలసిన బాధ్యత పెద్దల పై వున్నది. చిన్న పిల్లల అశ్రద్ధకు అనేక కారణాలు వుంటాయి. ఉదాహరణకు ఇంట్లోని వాతావరణం, ఆర్థిక స్థితి, ప్రేమ రాహిత్యం అతి గారాబం, ఉపాధ్యాయుల కఠిన వైఖరి, తల్లిదండ్రుల ప్రవర్తన, స్నేహితుల హేళన, పరా జయ పరంపరలు, ఇలా రక రకాల మానసిక ఒత్తుడులులాంటి అనేక కారణాలు పిల్లల ప్రవర్తన పై గాఢమయిన ప్రభావాన్ని కలిగి వుంటాయి. పెద్దలు తొందరపడి చిన్న పిల్లలను కలవర పెట్టి వారి ఆత్మాభిమానాన్ని కుంటుపర్చకూడదు. చిన్న పిల్లలు దోషమనస్థత్వంతో, తప్పుచేస్తామనే భావంతో కుంచించుకు పోతారు. అప్పుడు ఆత్మ న్యూనతాభావం వృద్ధిచెంది, ఆత్మాభి మానాన్ని క్షీణింప చేస్తుంది. తత్ఫలితంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఇతరుల పై ఆధారపడే స్వభావాన్ని అలవర్చుకొంటారు. తల్లిదండ్రులు ఇట్టి ప్రమాదాలను నివారించాలి.