Home Life Style అమ్మ ప‌దానికి అర్ధం తెలిపిన గీత ర‌చ‌యిత‌లు

అమ్మ ప‌దానికి అర్ధం తెలిపిన గీత ర‌చ‌యిత‌లు

అమ్మ అంటే ఈ ప్ర‌పంచంలో న‌చ్చ‌న‌ది ఎవ‌రికి అంద‌రికీ అమ్మంటే ప్రాణం. అందుకే ఆమె పైన సినిమాలు తీసినా, ఎన్ని పాట‌లు రాసినా అవ‌న్నీ హిట్ ఖాతాలోనే చేర‌తాయి. మన గీత రచయితల్లో చాలామంది అమ్మ పాటలు రాశారు. వాళ్లలో ముందు చెప్పుకోవాల్సింది జూనియర్‌ సముద్రాల గురించి! అరవై ఏళ్ల కిందటి ‘పాండురంగ మాహాత్మ్యం’ కోసం ఆయన రాసిన ‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా’ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కన్నూమిన్నూ కానక కన్నవాళ్లనే కాలదన్ని, కాళ్లు పోగొట్టుకుంటాడు పుండరీకుడు. అప్పుడు గానీ, చేసిన తప్పు తెలిసిరాదు. వెంటనే కన్నీళ్లతో అమ్మానాన్నల కాళ్లు కడుగుతాడు. ఈ సన్నివేశానికి ఆర్ద్రత నిండిన పాట రాశారు జూనియర్‌ సముద్రాల. ‘పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి- మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసినా- ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితి- తలచకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మా’ అంటూ ఆ కొడుకుతో పాడించారాయన. పశ్చాత్తాపంతో కుమిలిపోయే అతని హృదయాన్ని ‘మారిపోతినమ్మా నా గతి ఎరిగితినమ్మా- నీ మాట దాటనమ్మా ఒకమారు కనరమ్మా’ అన్న మాటలతో ఆవిష్కరించారు. ‘మాతా పిత పాదసేవే మాధవసేవ’ అనే సందేశాన్నందించే ఈ గీతం ఓ ఆణిముత్యం.

ఇటీవల వచ్చిన ‘పాండురంగడు’ చిత్రంలో ఇదే సందర్భానికి సుద్దాల అశోక్‌తేజ పాట రాశారు. ‘మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను’ అంటూ ఇది ప్రారంభమవుతుంది. ‘అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవి- నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని- నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని- బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని- తెలియనైతి తల్లీ, ఎరుగనైతినమ్మా…’ అంటూ తల్లి పాదాలను శరణువేడతాడు ఆ కొడుకు. వేర్వేరు తరాలకు చెందిన ఇద్దరు రచయితలు ఒకే సందర్భానికి పాట రాయడం అరుదు. అలాంటి అరుదైన సన్నివేశానికి పునాది అయిన తల్లీబిడ్డల పేగుబంధాన్ని ఆ ఇద్దరూ అంతే బాగా అక్షరీకరించారు. ఇక అశోక్‌తేజ రాసిన మరో అమ్మపాటా అర్థవంతమైందే. ‘సువ్వీ సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మా- నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ’ అంటూ మొదలయ్యే ఈ గీతం (‘లోఫర్‌’ చిత్రంలో)… చిన్ననాడే తల్లికి దూరమైన ఓ కొడుకు ఆవేదనకు అక్షరరూపం. ఇలా మ‌రెన్నో పాట‌లు ఉన్నాయి. సినీ క‌వుల క‌లం నుంచి వాలుజ‌రిన పాట‌లు మ‌రెన్నో ఉన్నాయి.

- Advertisement -

Related Posts

Kiwi Fruit: కివీ పండు తింటే కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు

కివీ ఫ్రూట్. దీన్ని మన దగ్గర సపోటాతో పోల్చుతుంటాం. నిజానికి.. కివీ పండుకు సపోటాకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. అది వేరు.. ఇది వేరు.. అయితే కివీ ఫ్రూట్.. మన దగ్గర...

చలికాలంలో జామపండు తింటున్నారా? అయితే ముందు ఇది తెలుసుకోండి?

ప్రస్తుతం మనం కరోనా కాలంలో ఉన్నాం. ఈ సమయంలో కరోనాను ఎదుర్కోవాలంటే మనకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుండాలి. లేదంటే కరోనా అటాక్ చేసేస్తుంది. మన బాడీలో రోగ నిరోధక శక్తి తక్కువైతే చాలు.....

చాయ్ లో చక్కెర కాకుండా బెల్లం వేస్తున్నారా? ముందు ఇది చదవండి..!

టీ లేదా చాయ్ లేదా తేనీరు.. పేరు ఏదైనా దీనికి ఉన్న డిమాండే వేరప్పా. మామూలుగా కాదు. పొద్దున లేస్తే చాయ్.. పొద్దున నుంచి రాత్రి పడుకునే లోపు ఓ మూడు నాలుగు...

కరోనా రావద్దని అతిగా చికెన్ తింటున్నారా? ముందు ఇది చదవండి..!

అసలు చికెన్ తింటే మంచిదా? తినకుంటే మంచిదా? తిన్నా ఎంత తినాలి? ఎక్కువ తింటే మంచిదేనా? కరోనా సమయంలో చికెన్ తినాలంటూ డాక్టర్లు కూడా సూచిస్తున్నారు? మరి.. రోజూ ఎంత చికెన్ తినాలి?...

Latest News