తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆపార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విజయ్ స్వయంగా ప్రకటించాడు. తన అభిమానులు ఎవరు కూడా ఆ పార్టీలో చేరవద్దు ఆ పార్టీకి మద్దతు తెలపవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. విజయ్ మక్కళ్ ఇయక్కం అభిమాన సంఘంను తాను రాజకీయ పార్టీగా మార్చుతున్నట్లుగా చంద్రశేఖర్ ప్రకటించడంతో విజయ్ ఆ విషయాన్ని ఖండించాడు. ఇదే సమయంలో అన్ని జిల్లాలకు చెందిన అభిమాన సంఘం నాయకులను మక్కళ్ ఇయక్కం కార్యకర్తలతో విజయ్ భేటీ అయ్యాడు.
ఈ సందర్బంగా విజయ్ అభిమాన సంఘం నాయకులకు సీరియస్ గా రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలంటూ సూచించారు. మక్కళ్ ఇయక్కం జిల్లా అధ్యక్షులు ఎవరైనా రాజకీయాలకు అనుకూలంగా వ్యవహరించడం లేదంటే తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీలోకి వెళ్లినట్లుగా తెలిస్తే వారిని అభిమాన సంఘం నుండి బహిష్కరిస్తాం అంటూ హెచ్చరించాడు. మదురై జిల్లాలో జరిగిన ఈ సమావేశంలో అభిమాన సంఘం నాయకులు ఎవరు కూడా పార్టలో చేరవద్దంటూ తీర్మానం చేయించాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలతో సంబంధాలు పెట్టుకోవద్దంటూ ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా విజయ్ తెలియజేశాడు. దీంతో తన తండ్రి చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ విషయమై ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.