ఈ రికార్డ్ మన తెలుగు హీరోలెవరూ ట్రై చేయలేదు

(సూర్యం) 

హీరోలు కన్నా వాళ్ల అభిమానులు కోరుకునేది కొత్తదనం కూడిన రికార్డ్ లు. అందుకే యూట్యూబ్ వ్యూస్ దగ్గర నుంచి అన్నీ రికార్డ్ లుగా మారిపోతున్నాయి. సోషల్ మీడియాలో హీరోని ఎంత మంది ఫాలో అవుతున్నారనేది రికార్డే. ఓ ట్రైలర్ కు ఎన్ని డిస్ లైక్స్ వచ్చాయనేది రికార్డే. ఇలా కాదేది రికార్డ్ కు అనర్హం అన్నట్లు తయారైంది. ఈ నేపధ్యంలో తమిళ స్టార్ హీరో విజయ్ తన తాజా చిత్రం సర్కార్ కు ఓ కొత్త రికార్డ్ ని నెలకొల్పుతున్నారు. ఆ రికార్డ్ ఇప్పటివరకూ తెలుగులో కూడా ఏ హీరో ట్రై చేయలేదు. అదేమిటంటే..

కేరళలోనూ విజయ్ కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. విజయ్‌ సినిమా విడుదలను అక్కడి ఫ్యాన్స్ పండుగలా జరుపుకొంటారు. ‘సర్కార్’ సినిమా దీపావళి సందర్భంగా నవంబరు 6న విడుదల కాబోతోంది. దీన్ని కేరళ.. త్రిసూర్‌లోని కార్తీక థియేటర్‌లో విరామం లేకుండా 24 గంటలు ప్రదర్శించటానికి ఏర్పాట్లు చేసారు. ఇప్పటివరకూ ఏ ఇండియన్ హీరోకు ఈ ఘనత దక్కలేదు కేవలం విజయ్ కే సాధ్యమైంది.

అయితే ఈ రికార్డ్ ని బ్రద్దలు కొట్టాలని తమిళనాట విజయ్ ఫ్యాన్స్ భావిస్తునన్నారు. చెన్నైలోని రోహిణి థియేటర్‌లో కూడా ‘సర్కార్‌’ను 48 గంటలపాటు ఎటువంటి విరామం లేకుండా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరో ప్రక్క ఈ సినిమాను విజయ్‌ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేనంత భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దాదాపు 80 దేశాల్లో 3000లకు పైగా స్క్రీన్స్‌లో సర్కార్‌ సినిమా విడుదల కానుంది. తెలుగు నాట కూడా సర్కార్‌ 600 స్క్రీన్స్‌పై సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

సాటిలేని క్రేజ్ తో రిలీజ్ అవుతున్న ‘సర్కార్‌’ సినిమాకు ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. కీర్తి సురేశ్‌ హీరోయిన్. వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. ఇందులో విజయ్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి సీఈవోగా కనిపించనున్నారు. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోంది.