విజయ్ “బీస్ట్” నష్టాలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..?

తమిళ నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరోలలో తలపతి విజయ్ కూడా ఒకడు. తన సినిమాల టీజర్, ట్రైలర్ లు అలాగే పాటలకి సోషల్ మీడియా నుంచి రికార్డు స్థాయి రెస్పాన్స్ వస్తుంది. అంతే కాకుండా విజయ్ సినిమాలకి కూడా భారీ వసూళ్లే నమోదు అవుతాయి. 

కాకపోతే చాలా సార్లు మాత్రం విజయ్ సినిమాల బాక్సాఫీస్ వసూళ్లపై ఫేక్ అంటూ పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలా లేటెస్ట్ గా తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “బీస్ట్” కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన ఈ సినిమా ఆడియెన్స్ నుంచి యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. 

కానీ తమిళ నాట అయితే మంచి వసూళ్లనే రిజిస్టర్ చేసినట్టుగా కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పారు. అయినా ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చాయని టాక్ మాత్రం అంతిమంగా ఉంది. కానీ లేటెస్ట్ గా అయితే సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. 

బీస్ట్ సినిమాకి నష్టాలు ఎక్కడా రాలేదని సినిమా 90 శాతానికి పైగా వసూళ్లను రాబట్టేసింది అయినా కూడా కొందరు ఇంకా భారీ నష్టాలు ఈ సినిమాకి వచ్చాయి అంటూ ప్రచారం చేయడం బాధాకరం అని తెలిపారు.అయితే ఇక్కడ 90 శాతం అంటే తెలుగులో ఈ సినిమా లాభాల్లోకి వెళ్లలేదు, బహుశా దానికోసం చెప్పి ఉండొచ్చు.  మొత్తానికి అయితే బీస్ట్ నష్టాలపై వారు ఈ రకమైన క్లారిటీని అందించారు.