అమలాపాల్ న్యూడ్ యాక్ట్, కరుణ్ జోహార్ కళ్లు తెరుచుకున్నాయి

కరణ్ జోహార్ కు అర్దమైంది,టెమ్ట్ అయితే లాభం లేదని

సినిమా చూడకుండా కేవలం ట్రైలర్ చూసి మురిసి పోయి, ఆ సినిమాని హిందీలో చేసేస్తానని కమిటైపోవటం, ఆ తర్వాత నాలుక కరుచుకోవటం ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ కమ్ నిర్మాత కామన్ అయ్యిపోయింది. ఆ మధ్యన డియర్ కామ్రేడ్ సినిమా ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యి దాన్ని హిందీలో రీమేక్ చేస్తానన్న ఆయన ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. అలాగే అమలాపాల్ నటించిన ఆడై చిత్రం ట్రైలర్ చూసి , హిందీలో చేస్తానని అన్నారు. ఇప్పుడు ఆ నిర్ణయం కూడా ఆవేశంలో తీసుకున్నదే అని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరోయిన్ అమలాపాల్ నటించిన సినిమా ‘ఆడై’ టీజర్ విడుదలై మొదట సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ దీన్ని విడుదల చేశారు. ‘ఆడై’ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో అమలాపాల్ అరకొర దుస్తులతో కనిపించగా.. టీజర్‌లో పూర్తి నగ్నంగా కనిపించి దుమారం రేపింది. దాన్ని చూసి హిందీలో సినిమా చేస్తానని అన్నారు.

ఇప్పటి వరకు తమిళంలో ఏ హీరోయిన్ చేయని అమలాపాల్ చేసి చూపించింది. రత్నకుమార్ దర్శకత్వం వహించిన ‘ఆడై’ సినిమాలో చేసింది. ఈ సినిమాలో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలో అమలాపాల్ నటించడంతో.. ఆమె డేరింగ్ అటెంప్ట్ చేయడాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు అభినందించారు. అయితే సినిమాని మాత్రం ఆదరించలేదు. డిజాస్టర్ అయ్యింది. డియర్ కామ్రేడ్ ది అదే వరస.