హై ఓల్టేజ్‌ యాక్షన్‌తో విశాల్‌ ‘యాక్షన్‌’ టీజర్ విడుదల

తమిళనాట మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్ కొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘యాక్షన్‌’. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.ఈ చిత్రంలో విశాల్ సరసన తమన్నా నటిస్తోంది. ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించేందుకు పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ‘యాక్షన్‌’. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ టీజర్‌లో ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తున్న యాక్షన్‌ సన్నివేశాలను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు. కనువిందుగా ఈ టీజర్‌ ఉందని చెప్పుకోవచ్చు. టర్కీలోని అందమైన ప్రాంతాల్లో అంతే అందంగా ప్రతి షాట్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ చిత్రంలో విశాల్‌ అండర్‌ కవర్‌ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా నటిస్తున్నారు. విశాల్‌ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్‌ చిత్రం.