‘ఏజెంట్’ గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : అనిల్ సుంకర

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిర్మాత అనిల్ సుంకరమీడియాతో సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ఏజెంట్’ మీ బ్యానర్ లో ప్రతిష్టాత్మక చిత్రం కదా.. ఎక్సయిట్ మెంట్ ఉందా ? ఒత్తిడి ఫీలౌతున్నారా ?

రెండు రకాలుగా వుంది. నిజాయితీగా చెప్పాలంటే కొంచెం ఒత్తిడి అయితే వుంది. ఫలితం గురించి కాదు. గత నెల రోజులుగా రాత్రి,పగలు యూనిట్ అంతా పని చేస్తోంది. చాలా పెద్ద సినిమా. గంటన్నర సీజీ వర్క్. ప్రతి ఫ్రేం లో సీజీ వుంటుంది. ఇదంతా ఒత్తిడితో కూడుకున్నదే.

‘ఏజెంట్’ ఏ విషయంలో బిగ్ మూవీ ?

ఏజెంట్ భారీ స్పాన్ వున్న సినిమా.స్పై సినిమా అనగానే అవుట్ డోర్ వుంటుంది. అన్నీ ఫారిన్ లోకేషన్స్. యాక్షన్స్ సీన్స్ కోరియోగ్రఫీ చేసిన తర్వాత, ఎడిటింగ్ చేసిన తర్వాత మార్పులు వస్తే కష్టం. మామూలు ఎంటర్ టైనర్స్, డ్రామా మూవీలలో చిన్న చిన్న తప్పులు వుంటే సర్దుకుపోవచ్చు. ఏజెంట్ లాంటి మూవీకి అది కుదరదు. అందుకే చాలా సమయం తీసుకుంది.

బడ్జెట్ కూడా మార్కెట్ కి మించి వుందని విన్నాం ?

ఇది వరకే చెప్పాను. మార్కెట్ అనేది ఇంకలేదు. కంటెంటే మార్కెట్. కంటెంట్ కి పెట్టాల్సిన ఖర్చు పెడితే దానిని వెనక్కి తీసుకురావచ్చు.

మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ మార్కెట్ బాగా పెరిగింది కదా.. ఇది మీకు అడ్వాంటేజ్ అయ్యిందా ?

ఖచ్చితంగా అడ్వాంటేజే. మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ హిట్ కొడితే మనది మనకి వచ్చేస్తుందనే నమ్మకం వుంది.

ఏజెంట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ కదా .. అటు వైపు ఎందుకు అలోచించలేదు ?

‘ఏజెంట్’ అందరికీ నచ్చే కంటెంట్. అయితే పాన్ ఇండియా విడుదలకు కనీసం మూడు నెలలు సమయం వుండాలి. మొదట తెలుగుపై ఫోకస్ చేసి సెకండ్ వీక్ నుంచి అటు వైపు ప్లాన్ చేసే అలోచన వుంది. ఇప్పటికే డబ్బింగ్ అంతా పూర్తయింది.

బడ్జెట్, బిజినెస్ పరంగా ఇప్పుడు నిర్మాతలు కష్టాలు ఎదురుకుంటున్నారనే అభిప్రాయం వుంది కదా?

నా వరకూ నేను చాలా హ్యాపీ అండీ. సినిమా మొదలుపెట్టినప్పుడే మేము పెద్ద సవాల్ ని తీసుకుంటున్నామనే క్లారిటీ వుంది. మేము ఒక లక్ష్యంతో వచ్చాం. ఏజెంట్ విడుదలైన తర్వాత అఖిల్ స్పాన్ డిఫరెంట్ గా వుంటుంది.

స్పై సినిమాలు చేసినప్పుడు హాలీవుడ్ సినిమాలతో పోలికలు వస్తాయి కదా ? దిన్ని ఎలా చూస్తారు ?

జేమ్స్ బాండ్ సినిమాతో పోలిక పెడితే నాకు ఆనందమే.(నవ్వుతూ) పోలిక పెట్టుకున్నా ఫర్వాలేదు. ఆ స్థాయికి రీచ్ అయ్యామంటే మనం గెలిచినట్లే.

ఏజెంట్ ఎలా వుండబోతుంది ?

ఏజెంట్ యాక్షన్ ఫిల్మ్. కథ భిన్నంగా వుంటుంది. ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ. ఎమోషన్స్ కూడా బలంగా వుంటాయి. అఖిల్ కి.. బిఫోర్ ఏజెంట్, ఆఫ్టర్ ఏజెంట్ లా వుంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా వుంటాయి. ఆశ్చర్యపరుస్తాయి. గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం ఏజెంట్.

యాక్షన్ సినిమాల్లో హీరో రియల్ స్టంట్స్ చేసేటప్పుడు నిర్మాతగా ఒక భయం వుంటుంది కదా.. ఏజెంట్ విషయంలో మీరు ఎలాంటి సూచనలు చేశారు ?

యంగ్ హీరోలు డూప్ లేకుండా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక నిర్మాతగా సేఫ్టీ చూసుకోమని యాక్షన్ కోరియోగ్రఫర్ కి చెప్తాను. మొన్న విజయవాడలో జరిగిన స్టంట్ కి మాత్రం వద్దు అని చెప్పాను. అది హైదరాబాద్ లో అయితే మంచి యాక్షన్ మాస్టర్స్, భద్రత వుంటుందనేది నా ఆలోచన. అఖిల్ మాత్రం అక్కడే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో క్రెడిట్ అంతా అఖిల్ దే. ఏజెంట్ లో అలాంటి చాలా సాహసాలు ప్రేక్షకులు చూస్తారు.

స్పై క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుందా ? లేదా ఫన్ ఉంటుందా ?

ఏజెంట్ క్యారెక్టర్ లో ఫన్ వుంటుంది. ట్రైలర్ లో చూసే వుంటారు. ప్రతీది ఎంజాయ్ చేస్తుంటాడు.

మీరు చాలా బ్లాక్ బస్టర్ సినిమాలని డిస్ట్రిబ్యుషన్ చేశారు.. కానీ ఏజెంట్ ని ఒక్కరికే ఇచ్చేయడానికి కారణం ?

సమయానికి రిలీజ్ కావాలి, క్యాలిటీ రావాలి.. ఇలా చాలా వుంటాయి. ఒక్కరికి ఇచ్చేస్తే ఆర్ధికపరమైన ఒత్తిడి కూడా వుండదు.

మీరు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ .. సినిమాని బిజినెస్ లా చూస్తారా ? లేదా ప్యాషన్ తో చూస్తారా?

బిజినెస్ గా చూడాలని అనుకుంటాను. చివరి నిమిషానికి మాత్రం సినిమా హిట్ కావాలని అనుకుంటాను(నవ్వుతూ). పది కోట్లు కావాలా? సూపర్ హిట్ కావాలా అని నిర్మాతకి అడిగితే.. సినిమా సూపర్ హిట్ కావాలనే కోరుకుంటాడు. అలా అని హిట్ అయిన ప్రతి సినిమాకి డబ్బులు వస్తాయని కూడా చెప్పలేం.

దర్శకుడు సురేందర్ రెడ్డి గారు కోవిడ్ బారిన పడినపుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా వుండేది ?

ఆయనతో మాట్లాడినపుడు సీరియస్ నెస్ అర్దమైయింది. బూడపెస్ట్ లో ఆయన వున్న చోటా అన్నీ ప్రభుత్వ హాస్పిటల్స్. అందరినీ ఒక రూమ్ లో పడేశారు. ఒకొక్కరుగా చనిపోతున్నారు. నిన్న బెడ్ పక్కన చూసిన వాడు ఈ రోజు వుండటం లేదు. రేపు మనకీ అదే జరగోచ్చు అనే ఫీలింగ్ వచ్చినపుడు .. అది ఊహించడానికే భయానకంగా వుంటుంది.

సురేందర్ రెడ్డిగారిని ఒక నిర్మాతగా చేసుకోవడానికి కారణం ?

ఏజెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఆయనే కలుస్తానని అడిగారు.

దర్శకత్వం చేసే ఆలోచనలు ఉన్నాయా ?

చేస్తున్నానండీ. స్పై జోనర్ సినిమా వుంటుంది.

‘ఏజెంట్’ టైటిల్ మీకోసం దాచుకున్నదేనా ?

ఏజెంట్ టైటిల్ ని ఐదేళ్ళ క్రితమే రిజిస్టర్ చేశాను. సురేందర్ రెడ్డి గారితో సినిమా అన్నప్పుడు ఆయన ఇదే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ ఆల్రెడీ మనం రిజిస్టర్ చేశామని చెప్పాను( నవ్వుతూ)

మీ బ్యానర్ లో చిన్న, పెద్ద సినిమాలు చేస్తున్నారు కదా.. ఏది ఎక్కువ కంఫర్ట్ వుంటుంది ?

దేని కంఫర్ట్ దానికి వుంటుంది. పెద్ద సినిమా హిట్ అయితే బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆర్ధికంగా చిన్న సినిమాలు బెటర్.

నిర్మాతగా ఏజెంట్ మీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది ?

ఏజెంట్ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా ఒత్తిడిలో విడుదల చేస్తున్న సినిమా ఇది. ఒక డేట్ ని లాక్ చేసి ఎలాగైనా ఆ డేట్ లో రావాలని అనుకున్నాం. ఆ డేట్ కోసం గత నెల రోజులుగా డే అండ్ నైట్ కష్టపడ్డాం.

14 రీల్స్ లో సినిమాలు వస్తున్నాయా ?

14 రీల్స్ లో సినిమాలు వస్తున్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్స్ వుంటాయి.

సాక్షి వైద్య ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి వస్తోంది.. ఈ సినిమా ఆమెకు ఎంత హెల్ప్ అవుతుంది ?

తనకు మంచి భవిష్యత్ వుంటుంది. మా సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఆమెకు కాల్స్ మొదలైపోయాయి.

భోళా శంకర్ అప్డేట్స్ ఏమిటి ?

యాక్షన్ జరుగుతోంది. ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నాం.