మా షాప్ లో దోపిడీ చేయడానికి దొంగలు కావలెను

ఇదేంది? షాప్ లో పనిచేయడానికి మనుషులు కావాలెను. అని ప్రకటనలు చూశాము కానీ ఇక్కడ డిఫరెంట్ గా ఉందేంటి అనుకుంటున్నారా? ఇదేదో పొరపాటుగా మనుషులు బదులు దొంగలు అని తప్పుగా ప్రింట్ పడిందనుకుంటున్నారా? కానీ మీరు చదివింది నిజమే. ఒక షాపు వారు తమ షాపులో దోపిడీ చేయడానికి దొంగలు కావలెను అని ప్రకటన ఇచ్చారు. దోపిడీ చేసినందుకు ఎంత రుసుము ఇస్తారో కూడా రాశారు. అంతేకాదు వారు ఏమేమి దోపిడీ చేస్తారో ఆ వస్తువులను కూడా వారికే ఇస్తారు. ఇంత బంపర్ ఆపర్ ఏంటబ్బా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు చదవండి.

‘‘ప్రముఖ బట్టల షాప్ లో పనిచేయడానికి దొంగతలు కావలెను మా స్టోర్ లో దొంగతనం చేసేందుకు అనుభవం, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోగలరు. జీతం గంటకు ఐదు వేలు’’  అని ఒక దుకాణం యజమాని ఒక వెబ్ సైట్ లో యాడ్ ఇచ్చారు. అంతేకాదు ప్రొఫెషనల్ దొంగలు కావాలని మెన్షన్ కూడా చేశారు. ఇప్పుడు ఈ టాపిక్ పై చర్చ దేశాలు దాటి ఖండాలకు విస్తరించింది. అసలు కథ చదివితే మీరు ఆశ్చర్యపోతారు.

బ్రిటన్ లోని ఒక మహిళ బార్క్. కామ్ అనే జాబ్ వెబ్ సైట్ లో ఈ రకమైన ప్రకటన ఇచ్చారు. తన బట్టల దుకాణంలో దోపిడీ చేసి వారు ఎలా దొంగతనం చేశారో తనకు వివరించాలని ఆమె పేర్కొన్నారు. ఈ రకంగా తన దుకాణంలో తరచుగా జరుగుతున్న దొంగలనాలను విజయవంతంగా అరికట్టవచ్చన్న ఉద్దేశంతోనే ఆమె ఈరకమైన ప్రకటన ఇచ్చారు. తమ దుకాణంలో దొంగతనం చేసిన వారికి గంటకు ఐదువేల చొప్పున ఇవ్వడంతోపాటు వారు ఏవైతే వస్తువులు దోపిడీ చేశారో వాటిలో నచ్చిన మూడు వస్తువులు కూడా వారికే ఇస్తామని ఆఫర్ పెట్టారు. 

2013లో తాను వస్త్ర దుకాణం ప్రారంభించానని ఆమె వెల్లడించారు. అయితే ప్రతి క్రిస్మస్ పండుగ సమయంలో తమ దుకాణంలో భారీగా దొంగతనాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదనతో చెప్పారు. ఆ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఈ కొత్త తరహా ఆలోచన చేసినట్లు చెప్పారు. ఇలా చేస్తే తమ దుకాణంలో సెక్యూరిటీ లోపాలను గుర్తించి సరిచేసుకుంటామని అంటుననారు. 

ఆమె ఆలోచన అందరికంటే భిన్నంగానే ఉన్నప్పటికీ ఇదేదో వర్కవుట్ అయ్యేలా ఉందని అంటున్నారు. మరి ప్రొఫెషనల్ దొంగలు ఇప్పటికే దొంగతనానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.