అనారోగ్యంగా ఉందని వైద్యుల దగ్గరకు వెళ్లిన యువకుడు.. వైద్యులు చేసిన పనికి షాక్..?

సాధారణంగా డాక్టర్లను దేవునితో సమానంగా భావిస్తారు . ఎందుకంటే దేవుడు ఒకసారి ప్రాణం పోస్తే డాక్టర్లు మాత్రం మనకి అనారోగ్యంగా ఉన్న సమయంలో మనకి సరైన వైద్యం చేసి మనకు జీవితాన్ని అందిస్తారు. అందువల్ల ప్రజలందరూ డాక్టర్ని దైవంతో సమానంగా భావిస్తారు. ఇలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ కొంతమంది వారి వృత్తికి అన్యాయం చేస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు అధిక డబ్బులకు ఆశపడి ప్రజలను మోసం చేస్తుంటే మరి కొంతమంది వచ్చే రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. వైద్యుల నిర్లక్ష్యానికి మరింత అనారోగ్యం పాలై తన మర్మాంగం కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాలలోకి వెళితే…ఫ్రాన్స్ లో నాంటెస్ యూనివర్సిటిలో చాలా కాలం క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల యువకుడు అనారోగ్యంగా ఉందని వైద్యులను సంప్రదించాడు. అతడికి పరీక్షలు చేసిన వైద్యులు.. యువకుడికి కార్సినోమా క్యాన్సర్ సోకినట్లు గుర్తించారు. తద్వారా శరీరం లోపల ఉండే అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకుతుందని తెలిపి యువకుడికి వైద్యం ఇవ్వడం మొదలు పెట్టారు.అయితే చికిత్స మధ్యలో వైద్యులు చేసిన కొన్ని పొరపాట్లు టిష్యూలకు వచ్చిన క్యాన్సర్ కాస్తా అతని మర్మాంగానికి వ్యాపించింది.

ఆ యువకుడి మర్మాంగానికి క్యాన్సర్ సోకడం వల్ల నరకం అనుభవించాడు. ఒకానొక సమయంలో తన మర్మాంగాన్ని తొలగించుకోవాలని ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే ఆ యువకుడి భార్య అడ్డుకోవటంతో తర్వాత వైద్యులను సంప్రదించాడు. అతడికి పరీక్షలు చేసిన అనంతరం మర్మాంగాన్ని పూర్తిగా తొలగించాలని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. దీంతో శస్త్రచికిత్స చేసి అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలగించారు. వైద్యుల పొరపాటు వల్లే తను మర్మాంగం తొలగించాల్సి వచ్చింది.. అందువల్ల తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వైద్యులు బాధితుడికి అనుకూలంగా తీర్పు ఇవ్వటమే కాకుండా .. వైద్యులు సైతం తమ పొరపాటును అంగీకరించి.. అతనికి రూ.54 లక్షలు పరిహారం కూడా చెల్లించారు.