నిజంగానే ప్యారిస్ అందమైన నగరం (రిచ్ వీడియోలు)

ఫ్రాన్స్ రాజధాని ఏది అని అడిగితే చాలా మందికి తెలవొచ్చు తెల్వకపోవచ్చు.. కానీ ఈఫిల్ టవర్ ఎక్కడుందంటే మాత్రం ప్యారిస్ లో అని టక్కున సమాధానం చెబుతారు. ఎందుకంటే గొప్ప చరిత్రను మూటగట్టుకున్న అద్భుతమైన నిర్మాణం ఈఫిల్ టవర్. ప్రాన్స్ రాజధాని ప్యారిస్ ప్రపంచ మేటి నగరాల్లో ఒకటి. ప్యారిస్ లో జరిగిన 25వ యురోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ సౌత్ ఏషియన్ స్టడీస్ 2018 లో  ఇండియాకు చెందిన పిహెచ్ డీ స్టూడెంట్స్ పాల్గొన్నారు.

మొత్తం 550 మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇండియా నుంచే 143 మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆ  బృందంలో తెలంగాణ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరు దయా అరుణ. దయా అరుణ సొంతూరు పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామం. అరుణ ప్రస్తుతం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వ విద్యాలయంలో పిహెచ్ డి చదువుతున్నారు. ఈ సదస్సులో కుల లింగ వివక్ష.. దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అరుణ ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ సదస్సు ఈనెల 24 నుంచి 27వరకు జరిగింది. సదస్సు నుంచి వచ్చిన తర్వాత తన పర్యటనపై ఆర్టికల్స్ రాస్తానని దయా అరుణ తెలిపారు.

దయా అరుణ ప్రాన్స్ లో సెమినార్ సెషన్స్ అయిపోగానే సిటీ అంతా తమ బృందంతో చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలను ఫేస్ బుక్ లో తన వాల్ మీద పోస్టు చేశారు. ఈఫిల్ టవర్ వీడియోతోపాటు మంచు కురుస్తున్న వీడియోలు కూడా కింద ఉన్నాయి చూడండి.