అమెరికాలో ఎక్కడ చూసినా తెలుగోళ్లే…

తెలుగు వాడు భారత  ప్రధాని అయ్యాడు. తెలుగు వాడు రాష్ట్రపతిఅయ్యాడు.  భారతదేశంలో జనాభారీత్యా తెలుగువాళ్ల బాగా ఎక్కువ.  ఇపుడు అమెరికాలో తెలుగోళ్ల సంఖ్య పెరిగిపోతా ఉంది. అట్లాఇట్లా కాదు,  ప్రపంచంలో ఏ జాతీయులు పెరగనంత వెేగంగా  అమెరికాలో తెలుగు మాట్లాడేవారి  సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని ఆటావాళ్లోటాటావాల్లో చెప్పలేదు. అమెరికా ప్రభుత్వమే ప్రకటించింది.

ఈ లెక్కన తెలుగువాడు అమెరికా అధ్యక్షుడవుతాడా? ఎమో ఎవరుచూశారు.

అధ్యక్షుడవుతాడో లేదో గాని,  అమెరికాలో ఎక్కడ చూసినా  తెలుగువాళ్లు  కనబడుతున్నారట.  కారణం జనాభా బాగా పెరిగిపోతున్నది. ఇప్పటికే  అమెరికా అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటి.

అమెరికాలో  భారతదేశంలోని అన్నిరాష్ట్రాల ప్రజలు ఉన్నా, తెలుగువారి సంఖ్యే ఎక్కువని ఈ మధ్య  సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (CIS) చెప్పింది. ఈ సంస్థ ఈ నెలలోనే (సెప్టెంబర్ 2018) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2010-2017 మధ్య తెలుగు  మాట్లాడే వారి సంఖ్య ఎంత పెరిగిందో తెలుసా?

86 శాతం. ఏ భారతీయ రాష్ట్ర జనాభా ఇంత పెరగలేదు. అంతేకాదు, అమెరికాలో ఏ విదేశీ భాష మాట్లాడే వారి జనాభా కూడా ఈ స్థాయిలోపెరగలేదు.

ఇతర భాషలకు సంబంధించి అరబిక్ 42 శాతం, హిందీ 42 శాతం, ఉర్దు 30 శాతం, చైనీస్ 23 శాతం, గుజరాతి 22  రేటుతో పెరిగాయి.