ఐపీల్ 2020: చిత్తుగా ఓడిపోయిన కోలకతా ,కోహ్లీ సేన ఘన విజయం

Rcb won the match against kkr
Rcb won the match against kkr
Rcb won the match against kkr

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరో విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. 82 పరుగులతో తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ బాట్స్‌మెన్స్ ఆర్సీబీ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ శుభమన్ గిల్(34) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. సునీల్ నరైన్ స్థానంలో వచ్చిన ఇంగ్లండ్ సెన్సేషన్ టామ్ బాంటన్‌(8) స్వల్ఫ పరుగులకే ఔటై నిరాశ పరిచాడు. అక్కడి నుంచి మెుదలైన కోల్‌కతా వికెట్ల పతనం.. నితీష్ రాణా(9) , ఇయాన్ మోర్గాన్(8),దినేశ్ కార్తీక్ (1) ఆండ్రీ రస్సెల్(16)తో మిడిలార్డర్ మెుత్తం విఫలమైంది. పేలవ బ్యాటింగ్‌తో తడబడి 112 పరుగులకే పరిమితమైంది. సూపర్ ఆటతో ఆర్సీబీ మరో విజయాన్ని అందుకుంది. వరుసగా తమ లక్ష్యాన్ని కాపాడుకుంటూ బెంగళూర్ సత్తా చాటుతుంది. వాషింగ్టన్‌ సుందర్, మోరిస్‌లు‌ రెండు వికెట్లు సాధించగా,, చహల్‌, ఉదాన, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీలకు ఒక్కో వికెట్‌ దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఏబీ డివిలియర్స్‌(73 నాటౌట్‌; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మాస్టర్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌కు బెంగళూరు 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆర్సీబీ ఓపెనర్లు దేవదూత్‌ పడిక్కల్‌(32; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అరోన్‌ ఫించ్‌(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించింది. దాటిగా ఆడుతున్న దాటిగా ఆడుతున్న పడిక్కల్‌ (32) రసెల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఫించ్‌(47) కూడా బౌల్డై పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత కోహ్లి(33 నాటౌట్‌; 28 బంతుల్లో 1 ఫోర్‌) సహకారంతో డివిలయర్స్ రెచ్చిపోయాడు. పోర్లు,సిక్స్‌లతో విరుచుపడ్డాడు. 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. చివరకు ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో రసెల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలకు ఒక్కో వికెట్‌ దొరికింది.