ఉక్రెయిన్‌ వార్‌‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

joe biden campaigning in Telugu

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బలహీనత కారణంగానే రష్యా ఉక్రెయిన్ సైనిక దాడులు చేస్తోందని ఆరోపించారు. తాను అమెరికా అధ్యక్షునిగా ఉంటే రష్యా, ఉక్రెయిన్‌పై సైనిక దాడికి పాల్పడేది కాదన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలివైనవాడని.. అమెరికా పాలకులు మూర్ఖులన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి తను అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు.