థాయ్‌లాండ్ పిల్లలను కాపాడిన శక్తి ఏంటి?

వారంతా థాయిలాండ్ అండర్-16  ఫుట్ బాల్ జట్టు సభ్యులు. ఆ టీం సభ్యుల సంఖ్య 12మంది. ఆ 12 మంది వయస్సు 11-14 ఏళ్ల లోపే. వారికి ఫుట్ బాల్ కోచ్ గా ఎకపోల్ చాంతవాంగ్ ఉన్నారు. ఆయన ఓ బౌద్ద సన్యాసి. ఆయన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దీంతో ఆయన అనాథగా బౌద్దరామంలోనే పెరిగారు. ఏదైనా సాధించాలనే తపన ఆయనలో ఉంది. అందుకే చిన్నతనంలోనే అండర్ 16 ఫుట్ బాల్ జట్టుకు కోచ్ గా నియమితులయ్యారు. శిక్షణలో భాగంగా ఆయన పిల్లలందరిని తీసుకొని జూన్ 23న గుహలోకి వెళ్లారు. గుహలోకి వెళ్లిన తర్వాత వర్షాల వలన వరదలు సంభవించాయి. దీంతో గుహలోకి భారీగా వరద నీరు చేరింది. పిల్లలతో పాటు కోచ్ కూడా నీటి ప్రవాహంతో గుహలో చిక్కుకుపోయారు.

బౌద్ద సన్యాసి, కోచ్ అయిన ఎకపోల్ పిల్లలందరికి ధైర్యం చెప్పాడు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఏమీ కాదంటూ వారికి అభయమిచ్చాడు. తాను నేర్చుకున్న విద్యతో పిల్లలతోటి ధ్యానం చేయించాడు. శరీరంలోని శక్తిని ఎలా ఉపయోగించాలో వారికి చెప్పాడు. వారికి ఆధ్యాత్మిక ప్రభోదాలు చేశాడు. ధ్యానం చేసినప్పుడు ఏ అవయవం నుంచి ఎలా శక్తిని తీసుకోవచ్చో చెప్పి పిల్లలకు మనోధైర్యం నింపాడు. అలా వారు గుహలో 17 రోజుల పాటు గడిపారు. పిల్లలు గుహలో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న ప్రభుత్వం వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అలా రెస్క్యూ సిబ్బంది సహకారంతో, దేవుని దయతో వారంతా క్షేమంగా బయటపడ్డారు.

కోచ్ ఎకపోల్ రోజు ఉదయం, మధ్యాహ్నాం, సాయంత్రం, రాత్రి పిల్లలతో ధ్యానం చేయించాడు. ఒక్కరోజు అన్నం తీసుకోకపోతేనే మనమంతా చాలా నీరసంగా అయిపోతాం. అటువంటిది 17 రోజుల పాటు అన్నపానీయాలు లేకున్నా వారందరికి ధైర్యం నూరిపోసి కాపాడిన ఎకపోల్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

పిల్లలందరిని కాపాడిన శక్తి ధ్యానం…. ధ్యానంతో ఇంతటి మహాత్యం ఉందా అని అంతా ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే ఎవరైనా ధ్యానం చేస్తే ప్రశాంతత ఉంటుంది అంటారే తప్పా నిజంగా ధ్యానం చేసేది చాలా తక్కువ మంది. థాయిలాండ్ పిల్లలనున కాపాడిన శక్తి ధ్యానం అని తెలియడంతో అంతా విస్తుపోయారు. 17 రోజుల పాటు అన్న పానీయాలు లేకుండా గడపటం నిజంగా అధ్బుతం కదా…