పారిస్ తగలబడుతాంది, అక్షరాలా

ఎల్లో జాకెట్ ఉద్యమం లేదా ఎల్లో వెస్ట్ ఉద్యమం ఫ్రాన్ లో అంటుకుంది.  రాజధాని పారిస్ తో పాటు దేశంలోని అనేక పట్టణాలలో, చివరకు గ్రామీణ ప్రాంతాలలో కూడా  ఈ ఉద్యమం చెలరేగుతూ ఉంది.  నిన్న, శనివారం, నాడు సెంట్రల్ పారిస్ లో  ఎల్లో వెస్ట్ ఉద్యమకారులు ముఖానికి మాస్కులు ధరించి, పోలీసులతో తలపడుతూ టియర్ గ్యాస్  షెల్స్ విసురుతూ విధ్వంసానికి పూనుకున్నారు.  దారి వెంబడి కార్ల అద్దాలను పగుల గొట్టారు. అనేక చోట్ల కార్లకు నిప్పంటించారు. 

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే ప్రమాదం ఉండటంతో దేశంలో అత్యయిక పరిస్థితి విధించే అవకాశం ఉందని ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ప్రకటన చేశారు.

ఎల్లో వెస్ట్  ఉద్యమం అనేది ఇమాన్యుయేల్ మాక్రన్ ప్రభుత్వంలో పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలకు, ధరలకు, పన్నులకు వ్యతిరేకంగా మొదలయిన ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్గొనేవారంతా పసుపుపచ్చటి  సేప్టీ జాకెట్  ధరించి నిరసనలు తెలుపుతూ ఉండటంతో వారి నిరసనకు ఎల్లో వెస్ట్ లేదా ఎల్లో జాకెట్  ఉద్యమం అని పేరు వచ్చింది. పెట్రోలు పంపులలోకి,  మాల్స్ లోకి ప్రజలెవరూ వెళ్ల కుండా వీళు దిగ్బంధం చేశారు. చాలా చోట్ల మాల్స్ అద్దాలను ధ్వంసం చేశారు. గత పదేళ్లలో ఫ్రాన్స్ లో ఇంత పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడలేదు 

ఈ అయితే , ఫ్రాన్స్ లో చెలరేగిన ఈ మంటల గురించి తెలిసినా అధ్యక్షుడు మాక్రన్ సెగ తగిలే అవకాశం లేదు. ఆయన ఎక్కడో బ్యూనోస్ఎయిర్స్ లో జి-20 మీటింగ్ లో   కూర్చుని అంతర్జాతీయ మంతనాలాడుతున్నారు.

ఎల్లో వెస్ట్ ఉద్యమం మే లో ఒక పోస్టర్ విడుదల చేయడంతో మొదలయింది. అయితే, నవంబర్ 17, శనివారం, దాకా  ఈ ఉద్యమం నిద్రావస్థలోనే ఉండింది. నవంబర్ 17న చెలరేగింది. ఈ శనివారం న విస్తరించింది. హింసాత్మకమయింది. ఇది ఇంటర్నెట్ ఉద్యమమే. తాటాకు మంటలా చెలరేగి ఆరిపోతుందా లేక దావానలంలా విస్తరిస్తుందా చూడాలి.