పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ ఆ దేశంలో వూపందుకుంటున్నది.
ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి క్యాంపెయిన్ ఇపుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 3 లక్షల మందికి పైగా దీనికోసం ఉద్దేశించిన ఆన్ లైన్ పిటిషన్స్ మీద సంతకాలు చేశారు. పాకిస్తాన్ ఇండియాల మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తత వాతావరణాన్ని సడలింపచేసేందుకు బందీ గా పట్టుకున్న భారత్ పైలట్ అభినందన్ వర్తమాన్ ని ఏకపక్షంగా విడుదల చేయడాన్ని పాకిస్తానీయులు వేనోళ్ల కొనియాడుతున్నారు.
పాకిస్తాన్ కూల్చేసిన మిగ్ విమానం పైలట్ వింగ్ కమాండర్ అభిని బందీగా పట్టుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకుంది.
పాకిస్తాన్ ఆయనను విడుదల చేయదని, దీనితో రెండు దేశాల మధ్య వైరం యుద్ధం పూర్తి స్థాయి యుద్ధానికి దారితీయవచ్చని చాలా మంది అనుమానించారు.
దీనికి తోడు రెండు దేశాల మధ్య ఉన్న వాతావరణం కూడా ఆందోళన కలిగించేదిగా తయారయింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేష్ ను మూసేశారు. విమానాశ్రయాలను మూసేశారు. రెండు దేశాల మధ్య ఉన్న ఏకైక రైలు సంఝౌతా ఎక్స్ప ప్రెస్ ను నలిపివేశారు.
ఇట్లాంటి సమయంలో ఏలాంటి షరతులు లేకుండా అభినందన్ ను విడుదలచేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించడం దక్షిణాసియాలో శాంతినెలకొనేందుకు బాట వేసిందని పాకిస్తానీయులు ప్రశంసిస్తున్నారు.
అందుకే వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి కి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరును ప్రతిపాదించాలని చాలా మంది కోరుతూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇంగ్లండులో ఉన్న పాకిస్తానీయులు change.org ప్లాట్ ఫామ్ మీది నుంచి సంతకాలు సేకరిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ కు ఇప్పటి దాకా దాదాపు మూడు లక్షలు సంతకాలను సేకరించారు.
“We, hereby nominate the Prime Minister of Pakistan, Mr. Imran Ahmed Khan Niazi, for the Nobel Peace Prize for 2020 for his peace efforts and dialogues in the Asian region on diverse conflicts (e.g. Pakistan-India, Afghanistan-USA, Middle East etc.). His contributions deserve the international recognition with the award of Nobel Peace Prize in 2020, his aims of ensuring lasting peace in the region and discouraging revival of militarism should be recognized and greatly appreciated. ” change.org పిటిషన్ ఇది. ఇక ట్విట్టర్ లో #NobelPeaceForImranKhan హ్యష్ ట్యాగ్ తెగ ట్రెండింగ్ అవుతూ ఉంది.
ఈ ప్రాంతంలో శాంతికోసం ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతిబహుమతి ఇవ్వాలని పాక్ సమాచార శాఖ మంత్రి చౌదురి పవాద్ హుసేన్ శనివారం నాడు పార్లమెంటులో ప్రసంగిస్తూ నోబెల్ కమిటీని కోరారు.
ఈ మేరకు ఒక తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించింది. ఇమ్రాన్ తీసుకున్న ఒక నిర్ణయంతో నాలుగు రోజుల పాటు చెలరేగిన యుద్ధ వాతావరణం సద్దు మణిగింది. దీనితో ఇమ్రాన్ జాతీయంగా పార్లమెంటు మద్దతు లభించింది. ప్రతిపక్షం ప్రశంసించింది. పాక్ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ కూడా ప్రశంసించారు.