దెయ్య‌మా, మ‌నిషా?.. కార్లు గుద్దుకుంటూ వెళుతున్న అలానే న‌డుచుకుంటూ వెళుతున్నాడు!

దిగువ వీడియో చూడగానే ఎవరైనా సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగిందనుకుంటారు. అందులో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీ కొట్టిందని మీరు అనుకుంటారు. కానీ…ఆ వ్యక్తిని ఢీకొట్టిన ప్రతీ వాహనం ఆగకుండా వెళ్తోంది. ఇలా రెండు వాహనాలు ఢీకొట్టినా…ఆ వ్యక్తి ఏమాత్రం తడబడకుండా అలా రోడ్డు దాటుతూ వెళ్తుంటాడు. నిజంగా అతడు వ్యక్తే అయితే… అలా జరగడం అసాధ్యం. దీంతో అది దెయ్యం కాబట్టే సాధ్యమైందనే ప్రచారం జోరందుకుంది. అంతే ఆ వీడియో వైరల్ అయిపోయింది. అందులో చిత్రమైన మనిషి లాంటి నీడ రోడ్డుపై నడుస్తూ… వాహనాలు అడ్డు వస్తున్నా బెదరకుండా వెళ్లిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఇది ఫిలిప్పీన్స్ లోని ఓ నగరంలో జరిగిన దృశ్యం. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. జనరల్‌గా హేతువాదులు దెయ్యాలు ఉన్నాయంటే నమ్మరు. కానీ ఈ వీడియోని చూసిన వారికి… అందులో ఆకారం ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. దెయ్యాలు ఉన్నాయని అని నమ్మేవారు మాత్రం… “అదిగో.. అది దెయ్యమే… ఇప్పటికైనా హేతువాదులు దెయ్యాలు ఉన్నాయని నమ్మండి” అంటున్నారు. ఓ కిరాణా షాపు ముందు ఈ చిత్రమైన నీడ అలా వెళ్తూ కనిపించింది. షాకింగ్ విషయమేంటంటే… వాహనాల లోపలి నుంచి కూడా ఈ నీడ వెళ్లిపోయినట్లు ఫుటేజ్‌లో కనిపిస్తోంది.

రోడ్డుపై వెళ్తున్న ఎవరికీ అది కనిపించనట్లే విజువల్స్‌ని బట్టి తెలుస్తోంది. షాపు ఓనర్ సీసీ టీవీ ఫుటేజ్ లో ఈ విచిత్రం నిక్షిప్తమైంది. ఇది వెరైటీ దెయ్యం అంటున్నారు కొందరు. అయితే ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదట. ఎప్పుడో జూన్ నాటి ఫుటేజ్ అట. కాకపోతే… ఇన్నాళ్లూ భయంతో ఎవరికీ చెప్పకుండా తన దగ్గరే దాచుకున్నాడు షాపు కీపర్. ఇప్పుడు బాహ్య ప్రపంచానికి చూపించి కొత్త చిక్కుముడులు సృష్టించాడు. పైగా… ఓ డెలివరీ బాయ్‌కి చాలా దగ్గర నుంచి ఈ దెయ్యం వెళ్లిందట. ఆ డెలివరీ బాయ్‌ని పేరు మైకెల్ ఫోర్టో. ఈ వీడియో చూసినప్పటి నుంచి అతను బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. ఆ దెయ్యం తనను ఏమైనా చేస్తుందేమో అని భయపడుతున్నాడు. కెమెరా అద్దంపై వేరే ఎవరైనా నడిచి వెళ్లేది రిఫ్లెక్ట్ అయ్యి ఉంటుంది అని కొట్టి పారేస్తున్నారు మరికొందరు.