అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్ మృతి

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ ( హెచ్ డబ్ల్యు) బుష్ చనిపోయారు. అమెరికా కు ఆయన 41 అధ్యక్షుడు. అంతేకాదు, 43 వల అధ్యక్షుడయిన జూనియర్ బుష్ తండ్రి. శుక్రవారం నాడు ఆయన చనిపోయినట్లు ఆయన కుటుంబం తరఫున ఒక ప్రకటన విడుదలయింది.

 

రెండో ప్రపంచ యుద్ధ  సైనికుడిగా పనిచేసిన సీనియర్ బుష్ అమెరికా రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారు. గతంలో ఆయన  చైనాలో అమెరికా రాయబారిగా ఉన్నారు. అపైన ఆయన అమెరికా రాజకీయాల్లోకి వచ్చారు. మొదటు ఉపాధ్యక్షుడిగా, తర్వాత అధ్యక్షుడిగా  1989 నుంచి1993 దాకా ఉన్నారు.  అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన చివరి  రెండో ప్రపంచ యుద్ధ సైనికుడాయనే. ఆయనకు అయిదుగురు సంతానం, 17 మంది మనవళ్లు మనవరాళ్లున్నారు.

1942 జూన్ 12న మిల్టన్ లోని ఒక సంపన్న కుటుంబంలో ఆయన జన్మించాడు. బాాగా డబ్బు గడించాక ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు.58 విమాన దాడుల్లో పాల్గొన్నాడు.ఒకసారి ఆయన యుద్ధ విమానాన్ని జపాన్ కూల్చేసింది. అయితే, బుష్ పారాషూట్ దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. లైఫ్ జాకెట్ సహాయంతో సముద్రం నాలుగు గంటల పాటు గడిపాడు. తర్వాత ఒక సబ్ మెరైన్ వచ్చి ఆయన్ని కాపాడింది. రిపబ్లికన్ ప్రయిమరీలో అధ్యక్ష పదవి అభ్యర్థిగా రోనాల్డ్ రీగన్ చేతిలో ఓడిపోయారు.అయితే, ఆయనదగ్గిరే అమెరికా ఉపాధ్యకుడిగా పని చేశారు.అంతర్జాతీయ చమురు రాజకీయాలలో ఆరితేరినా దేశీయంగా ఆర్థిక వ్యవస్థ చితికిపోవడం, ధరలు పెరడగంతో బాాగా చెడ్డపేరు వచ్చింది. సద్దాం హుసేన్ కువాయిత్ అక్రమించుకుని ఇక సౌదీ మీదకు దండయాత్ర చేస్తాడనంగా ఆయన 32 దేశాలను వప్పించి, సంకీర్ణసైన్యం రూపొందింది సద్దాంకు వ్యతిరేకంగా గల్ఫ్ యుద్ధం నడిపారు.సద్దాం ను ఓడించారు గాని పదవీచ్యుతుని చేయలేకపోయారు. ఆతర్వాత 12 అనంతరం ఆయన కొడుకు జూనియర్ బుష్ సద్ధాం అంతమొందించడం వేరే కథ. సీనియర్ బుష్ కు గల్ఫ్ వార్ విజయం బాగా పేరు తెచ్చింది. అయితే, దేశీయంగా అయన విఫలమయ్యారు. రాజకీయంగా ఆయన  బాగా అప్రతిష్టపాలయ్యారు. గల్ఫ్ యుద్దం తర్వాత  1992లో రెండో దఫా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు.

ఆయన మరణంతో ఒక యుగం ముగిసిందని వాషింగ్టన్ పోస్టు వ్యాఖ్యానించింది. మూడు దశాబ్దాల కిందట అధ్యక్షుడిగా పనిచేసినా ఆయన ప్రవేశపెట్టిన విలువలే ఇంకా ఆమెరికా అధ్యక్షడిని నడిపిస్తున్నాయి.

మరణవార్తను ప్రకటించినా,  ఆయన ఎలా మరణించారో కారణాలు చెప్పలేదు. అయితే, తనకు వాస్క్యులార్ పార్కిన్ సోనజ మ్ ఉందని ఆయనే  2012లో ప్రకటించారు. ఈ జబ్బు వల్ల ఆయన కదలలేని పరిస్థితి వచ్చింది, చక్రాలకుర్చీకే పరిమితమయ్యారు. ఆయన భార్య బార్బారా బుష్ (73) ఈ ఏప్రిల్ 17 చనిపోయారు.