గల్ఫ్ లో తొలి గోపురం : హిందూ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన

అబుధాబిలో భారీ హిందూదేవాలయం నిర్మించేందుకు ఈ రోజు శాస్త్ర బద్దంగా పూజలుజరిగాయి. ఆలయ నిర్మాణానికి చేసే శిలాన్యాస్ విధి కార్యక్రమం స్వామినారాయణ్ సంస్థ (Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha) ధార్మిక గురువు మహంత్ స్వామి మహరాజ్ పర్యవేక్షణలో జరిగింది. ఈ సంస్థయే ఈ ఆలయం నిర్మిస్తూ ఉంది.
మధ్య ప్రాచ్యంలో ఇదే తొలి హిందూ దేవాలయం అవుతుంది. దీనిని నిర్మించిన ఘనత స్వామినారాయణ్ ట్రస్టు కు దక్కుతుంది.

పూజ్య ఈశ్వర్ చంద్ర స్వామి పూజాకార్యక్రమాలను ప్రారంభించారు. వేదపండితులు ఒక్కొ క్క కార్యక్రమాన్ని ఎందుకు ఎలా చేయాలో వివరించారు. ఈ పూజలు ఉదయం 10.50 నుంచి 10.55 దాగా సాగాయి. తర్వాత . పురోహితులు, బిఎపిఎస్ హిందూ మందిర్ కమిటీ హెడ్ బిఆర్ షెట్టీ నాయకత్వంలో శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమం కోసం భారత దేశం నుంచి 50 మంది పురోహితులు ఇండియానుంచి అబుధాబి వచ్చారు. ఆలయానికి అవసరమయిన ఉదారంగు రాళ్లను కూడా భారతదేశం రాజస్థాన్ నుంచి తెప్పించారు.


సుమారు నాలుగు గంటల సేపు నేటి పూజ్యాకార్యక్రమాలుసాగాయి.వందలాది మంది భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  గల్ఫ్ దాదాపు  33 లక్షల మంది హిందూ భారతీయులున్నారు.నేటి   కార్యక్రమంలో భారత రాయబారి నవ్ దీప్ సూరి ప్రధాని నరేంద్రమోదీ సందేశం వినిపించారు. మధ్యప్రాచ్యంలో హిందూదేవాలయ నిర్మాణానికి చొరవ తీసుకుంటున్నందుకు ప్రధాని యుఎఇ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

‘130 కోట్ల మంది భారతీయుల తరఫున నా ప్రియమిత్రుడు క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ ఎల్ నాయన్కు శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు గర్వపడుతున్నాను.’ ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.

మహంత స్వామి మహరాజ్ 1200 ఆలయాలను నిర్వహిస్తున్న స్వామినారాయణ్ ధార్మిక సంస్థకు అధిపతి. ఇవికాకుండా మరొక 4200 ధార్మిక కేంద్రాలను కూడా ఈ సంస్థ నిర్వహిస్తూ ఉంది.

కార్యక్రమంలో అబుధాబిలో నివసించే హిందువులే కాకుండా ఆదేశ విదేశీ వ్యవహారాల, అంతర్జాతీయ సహకారం మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నాయాన్, మత సామరస్యం మంత్రి షేక్ నాయాన్ ముబారక్ అల్ నాయాన్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. గురువారం నాడు స్వామి మహరాజ్ రె షేక్ నాయాన్ స్వాగతం పలికారు.

యుఎఇ రాజధాని అబుధాబిలో ఆలయ నిర్మించేందుకు 2015లో ప్రభుత్వం అనుమతినిచ్చింది.ప్రధాని నరేంద్ర మోదీ తొలి పర్యటన సందర్భంగా యుఎఇ ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి అనుమతి తెలిపింది. ఆలయానికి అవసరమయిన శిల్పాలను ఇండియాలో చెక్కించి అబుధాబికి తరలిస్తారని ట్రస్టు వారు తెలిపారు.

ఆలయ నిర్మాణం 13.5 ఎకరాలలో సాగుతుంది. ఈ భూమిని అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయె్ నాయాన్ భారతీయులకు కానుకగా ఇచ్చారు.