రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి ప్రవేశించాయి. దీంతో ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీని భద్రతా దళాలు బంకర్‌లోకి తరలించాయి. భీకర దాడి జరుగుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే తాము చర్చలకు సిద్ధమేనని తెలిపింది. అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌పై దాడులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ బలగాలు కూడా ప్రతిఘటిస్తున్నాయి. కీవ్ గగనతలంలో రష్యాకు చెందిన రెండు క్రూయిజ్ క్షిపణుల్ని, యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు తెలిపారు.