బెలారస్ సరిహద్దు ప్రాంతమైన గోమెల్ నగరం వేదికగా ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు జరపుతున్నారు. రష్యాకు చెందిన విదేశీ, రక్షణ మంత్రిత్వశాఖ, అధ్యక్ష కార్యాలయ అధికారులు ఈ ఉదయమే గోమెల్ చేరుకున్నారు. క్రెయిన్ బృందం కూడా గోమెల్ చేరుకున్నట్లు సమాచారం. మెుదటిగా రష్యా ప్రతిపాదనను తిరస్కరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తర్వాత చర్చలకు అంగీకరించారు. చర్చలకు అంగీకారం కుదిరిన సమయంలోనే అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించడం కొంత ఆందోళన కలిగిస్తోంది.