సూపర్ : ‘x మెన్‌: డార్క్‌ ఫినిక్స్‌’ తెలుగు ట్రైలర్‌

X-MEN సిరీస్‌లో వచ్చే సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు పదకొండు సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. త్వరలో ‘డార్క్ ఫినిక్స్’ అనే మరో సినిమా ఈ సీరిస్ నుంచి వస్తోంది. ‘ఎక్స్ మెన్ అపోకలిప్స్’‌కి సీక్వెల్‌గా రాబోతున్న డార్క్ ఫినిక్స్ తెలుగు ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేసారు.
 

సిమోన్‌ కిన్‌బర్గ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌ ఫినిక్స్‌ పాత్రలో నటించారు. సినిమాలో ఆమె పాత్రకు టెలీకైనెటిక్‌ శక్తులు ఉంటాయి. అంటే ఓ మనిషిని ముట్టుకోకుండానే వారిని ఏదైనా చేయొచ్చ అన్నమాట.

X-Men: Dark Phoenix | Official Telugu Trailer | June 5 | Fox Star India

ఈ చిత్రం కోసం సోఫీ డిసోసియేటివ్‌ ఐడెంటిటీ డిజార్డర్‌, షీజోఫ్రెనియా గురించి పరిశోధన చేశారట. ‘x మెన్‌’ సిరీస్‌లో ఓ నటికి ఇంతటి కీలక పాత్ర దక్కడం ఇదే మొదటిసారని దర్శకుడు కిన్‌బర్గ్‌ తెలిపారు.

సిమోన్ కిన్‌బర్గ్ డైరెక్ట్ చెయ్యగా, ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్, బ్యాడ్ హ్యాట్ హ్యారీ ప్రొడక్షన్స్, ది డానర్స్ కంపెనీ, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మించాయి. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని విడుదల చేస్తుంది జూన్‌ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.