టైటానిక్ చిత్రంతో భారత ప్రేక్షకులకు సైతం ఫేవరెట్ గా మారిన హీరో లియోనార్డ్ డికాప్రియో…గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన నటనతో అలరించే ..డికాప్రియో కు ఇప్పుడు ఓ రేంజి ట్విస్ట్ పడింది. ఆస్కార్ అవార్డ్ ని వెనక్కి తీసేసుకున్నారు.
లియోనార్డ్ డికాప్రియో తన సినీ కెరీర్‌లో మొత్తం ఐదు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. అయితే, 2016లో వచ్చిన ‘ది రెవెనెంట్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాడు. ఇది కాకుండా డికాప్రియో వద్ద మరో ఆస్కార్ ఉంది. 1954లో మర్లోన్ బ్రాండో అనే నటుడు ‘ఆన్ ది వాటర్ ఫ్రంట్’ చిత్రంలో నటనకు గానూ ఆస్కార్ దక్కించుకున్నాడు.
ఈ ఆస్కార్‌ను డికాప్రియో మలేషియాకు చెందిన పెట్టుబడిదారుడు జో లో నుంచి బహుమతిగా పొందాడు. ఇటీవల జో లో ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో అతను పలువురికి బహుమతులుగా ఇచ్చిన వస్తువులను అధికారులు వెనక్కి తీసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డికాప్రియోకు బహుమతికి ఇచ్చిన ఆస్కార్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు జో లో ఇచ్చిన పికాసో పెయింటింగ్‌ను కూడా డికాప్రియో ఇవ్వక తప్పడం లేదు.
ఇక అధికారులు స్వాధీనం చేసుకునే ఆ అవార్డును కేవలం ఒక డాలర్ మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి కొనుగోలు చేసే హక్కు తమకు ఉందని అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. ఒకసారి విచారణ పూర్తయితే, జరిగేది అదే.